
Jasprit Bumrah Will Be Playing A Test In India For The First Time ICC Did Tweet | Sakshi Cricket News
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి ఒక విషయం ఆసక్తి రేపుతుంది. అదేంటో తెలుసా.. ఇప్పటివరకు బుమ్రా టీమిండియా తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం.2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 21 సగటుతో 79 వికెట్లు తీశాడు. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేగాక అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 8 మ్యాచ్‌ల్లో 48 వికెట్లతో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా.. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుకెక్కాడు.